రియల్‌మీ అల్ట్రాడార్ట్ టెక్నాల‌జీ.. 20 నిమిషాల్లోనే బ్యాట‌రీ ఫుల్ చార్జింగ్ 

స్మార్ట్‌ఫోన్ ఎంత గొప్ప‌ద‌యినా బ్యాట‌రీ క‌ష్టాలు మాత్రం కామ‌నే. అలాగ‌ని బ్యాట‌రీ సైజ్ పెంచుకుంటూ పోయే కొద్దీ ఫోన్ బరువు పెర‌గ‌డం, పెర్‌ఫార్మెన్స్ త‌గ్గ‌డం లాంటి స‌మ‌స్య‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో రియ‌ల్‌మీ ఇండియాలో..  అల్ట్రాడార్ట్ పేరిట ఓ సూప‌ర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాల‌జీని తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇంతకీ ఏంటా టెక్నాల‌జీ?  దాని క‌థేంటో చూద్దాం. 

ఏమిటీ అల్ట్రా డార్ట్ టెక్నాల‌జీ?
ఇది ఒక ఫ్లాష్ ఛార్జింగ్ సొల్యూష‌న్‌. దీంతో 125 వాట్స్ ఛార్జింగ్ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చామ‌ని రియ‌ల్‌మీ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే రియ‌ల్‌మీ 30 వాట్స్‌, 50 వాట్స్‌, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచ‌ర్ల‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా డ‌బుల్ చేసి 125 వాట్స్ అల్ట్రా డార్ట్ ఫ్లాష్ ఛార్జింగ్ సొల్యూష‌న్‌ను తీసుకొచ్చింది. 

ఏంటి స్పెష‌ల్‌? 
125 వాట్స్ అల్ట్రా డార్ట్ ఫ్లాష్ ఛార్జింగ్‌తో 4,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కేవ‌లం 3 నిమిషాల్లోనే 33% ఛార్జ్ చేయోచ్చు.

మొత్తం 20 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ ప‌క్కా అని రియ‌ల్‌మీ ప్ర‌క‌టించింది.     

రియల్‌మీ అల్ట్రాడార్ట్ టెక్నాల‌జీ రియల్‌మీ అల్ట్రాడార్ట్ టెక్నాల‌జీ ఫాస్ట్ చార్జింగ్‌ రియల్‌మీ అల్ట్రాడార్ట్ టెక్నాల‌జీ125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ 125W UltraDART FlasH charging Solution Realme Ultradart Charging feature